ఇండస్ట్రీ టాక్ : మహేష్ సినిమా నుంచి ఈ స్టార్ హీరోయిన్ తప్పుకోలేదా?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా స్టార్డం ని మైంటైన్ చేస్తున్న స్టార్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. మరి అలాంటి వాటిలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు. అయితే పూజా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే పలు సినిమాలు చేయడానికి కూడా రెడీగా ఉంది. కానీ కారణం ఏంటో కానీ ఈమె పలు సినిమాల నుంచి అయితే తప్పుకుంది అని ఓ షాకింగ్ టాక్ మాత్రం బయటకి వచ్చింది. ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం కూడా ఒకటి. 

అయితే ఈ చిత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ గ్యాప్ లోనే ఈమె ఈ సినిమా నుంచి బయటకి వెళ్ళిపోయింది అని రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అయితే ఈ గాసిప్స్ పై ఒక బిగ్ క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తుంది అని ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోలేదని ట్రస్టడ్ సోర్సెస్ చెబుతున్నాయి. 
అలాగే రెండో హీరోయిన్ ని కూడా త్రివిక్రమ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. అంటే ఈ చిత్రంలో అయితే పూజా తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పాలి.