Jr Ntr Koratala Project : బిగ్ క్లారిటీ : జూ. ఎన్టీఆర్ సరసన ఈ బాలీవుడ్ స్టార్ బ్యూటీ కన్ఫార్మ్.!

Jr Ntr Koratala Project : మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మూడు వరుస భారీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సెటప్ చేసిన సంగతి తెలిసిందే. మరి వీటికన్నా ముందు దర్శకుడు రాజమౌళితో ట్రిపుల్ ఆర్(RRR) సినిమా చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చెయ్యబోయే సినిమాలు అవి కావున అంచనాలు అంతకు మించే నెలకొన్నాయి.

మరి ఈ చిత్రాల్లో మాత్రం మొదటి వరుసలో ఉన్నది బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియా సినిమా. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా ఇప్పుడు ముహూర్తానికి దగ్గర పడుతుండగా గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా హీరోయిన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి.

మరి దాని ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు వినిపించింది. అక్కడ నుంచి గట్టిగానే ఈ టాక్ ఆసక్తిగా నడిచినా ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా ఆలియా భట్ నే ఈ అంశాన్ని క్లారిటీ ఇచ్చింది. తాను ఎన్టీఆర్ మరియు కొరటాల సినిమాలో నటిస్తున్నానని ఇది నిజమే అని తెలిపింది.

దర్శకుడు కొరటాల నాకు వచ్చి కథ చెప్పడం జరిగింది అని అప్పుడే ఫిక్స్ అయ్యాను ఈ సినిమా చెయ్యాలి అని ఎన్టీఆర్ తో ట్రిపుల్ ఆర్ తర్వాత మరో సినిమా అదే అని తన లేటెస్ట్ సినిమా గంగూభాయ్ ఖతియవాది సినిమా ప్రమోషన్స్ లో తెలిపింది.

దీనితో ఈ భారీ సినిమాలో హీరోయిన్ ఎవరో అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి గాని అనిరుద్ పేరు కూడా వినిపిస్తుండగా ఇది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.