“అఖండ”లో ఒక్క ఏక్షన్ పార్ట్ కే ఇన్ని రోజులు చేసారా?

 

నందమూరి బారి హీరో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అఖండ”. టాలీవుడ్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఈ సినిమాపై తెలిసింది.

మామూలుగానే బోయపాటి సినిమాలు అంటే మొత్తం యాక్షన్ తోనే నిండిపోయి ఉంటాయి కానీ ఈసారి అఖండ లో మొత్తం ఏక్షన్ బ్లాక్ లు మాత్రమే 90 శాతం రోజులు కేటాయించి తీసారట. సినిమా అంతా 150 రోజులు షూటింగ్ అయితే అందులో ఏకంగా 110 రోజులు అలా ఓన్లీ ఏక్షన్ సన్నివేశాలనే తీసారట. దీని బట్టి ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అసలే వీరి నుంచి ఇది హ్యాట్రిక్ సినిమా అన్ని ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి మరి.