HomeNewsబాలయ్య సినిమాను ఇంకా వెంటాడుతున్న సమస్య??

బాలయ్య సినిమాను ఇంకా వెంటాడుతున్న సమస్య??

This Issue Still Following Balayya Akhanda Movie | Telugu Rajyam

టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ చిత్రాల్లో నటసింహం బాలయ్య అలాగే మాస్ అండ్ ఎమోషనల్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబోలో ప్లాన్ చేసిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ” కూడా డెఫినెట్ గా ఉంటుంది. అయితే అన్ని సినిమాల తాలూకా రిలీజ్ డేట్స్ వచ్చేస్తున్నా సమయంలో ఈ సినిమా డేట్ మాత్రం ఇంకా రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశలోనే ఉన్నారు.

కానీ దానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ సమస్యే అని ప్రధానంగా ఆ మధ్య వినపడిన టాక్. కానీ తర్వాత ఈ చిత్రం దీవాలీ కానుకగా వస్తుంది అని అంతా ఎదురు చూసారు అయినా కూడా ఇంకా ఈ చిత్రంపై క్లారిటీ రాకపోవడంతో ఈ సమస్య వల్లే ఇంకా మేకర్స్ వెనకడుగు వేస్తున్నట్టు టాక్. ఎందుకంటే బాలయ్య కెరీర్ లోనే ఏ సినిమాకీ అవ్వని బడ్జెట్ ఈ సినిమాపై నిర్మాతలు పెట్టారు.

అంతే స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బిజినెస్ జరిపింది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమా అని ఇండస్ట్రీ లో టాక్ ఉన్నా దీనికి జరిగిన బిజినెస్ కి అంత మొత్తంలో రాకుంటే నిర్మాతలకు ఫస్ట్ సినిమానే దెబ్బ పడుతుంది. అందుకే బహుశా వీరు ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోతుండాలి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించారు. వారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News