Rajasekhar: జీవిత కారణంగానే ఆ సినిమా నుంచి రాజశేఖర్ ని తప్పించారా?

Rajasekhar: ప్రస్తుత కాలంలో ఎంతో మంది సీనియర్ హీరోలు ఎన్నో సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలోను అదేవిధంగా కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే జగపతిబాబు శ్రీకాంత్ వంటివారు తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో రాజశేఖర్ కూడా సినిమాల్లో విలన్ పాత్రల కోసం ఎదురు చూస్తున్నారని మంచి పాత్రలు దొరికితే తప్పకుండా చేస్తానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

ఈక్రమంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అదే విధంగా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరో రాజశేఖర్ విలన్ పాత్రలో తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని చిత్రబృందం వెల్లడించినప్పటికీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి రాజశేఖర్ ను తప్పించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నారా? లేక తప్పించారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రాజశేఖర్ పాత్రకు సంబంధించిన కథ విషయంలో ఆయన సతీమణి జీవిత జోక్యం చేసుకున్నారని ఆమె ఇన్వాల్వ్ కావడం వల్లే రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.