పవన్ కళ్యాణ్ అలా చేయడం వల్లే రాజమౌళి పవన్ తో సినిమాలు చేయడం లేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా తెరకెక్కితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రావడం సాధ్యం కావడం లేదు. అయితే పవన్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. రాజమౌళి స్టూడెంట్ నంబర్1 సినిమా నుంచి వరుస విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే రాజమౌళి విక్రమార్కుడు సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించారు. అయితే కథ నచ్చకపోవడం, ఇతర కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇదే సమయంలో పవన్ నటించిన పలు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత రాజమౌళి రవితేజతో విక్రమార్కుడు సినిమాను తెరకెక్కించారు.

విక్రమార్కుడు సినిమాకు మొదట నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా రాజమౌళి పవన్ తో సినిమా చేసే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రాజమౌళి ఈ కాంబినేషన్ పై దృష్టి పెట్టడం లేదు. రాజమౌళి ఇతర హీరోలతో సినిమాలు తీస్తున్నా పవన్ తో సినిమా తీయడానికి ఆసక్తి చూపడం లేదు.

రాబోయే రోజుల్లో కూడా ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదని తెలుస్తోంది. అయితే పవన్ క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పవన్ అభిమానులు కోరుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.