పొడుగ్గా ఉందనే కాజల్ కు ఆ అవకాశం దక్కింది

This is how Kajal Aggarwal bags chance in Nagarjuna film

This is how Kajal Aggarwal bags chance in Nagarjuna film

కాజల్ అగర్వాల్ సైన్ చేసిన కొత్త సినిమాల్లో నాగార్జున సినిమా కూడ ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. కాజల్, నాగ్ మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశం. కాజల్, నాగ్ కాంబినేషన్ అనగానే ఫుల్ రొమాంటిక్ మూవీని ఎక్స్పెక్ట్ చేసుంటారు ఆడియన్స్. అయితే ఈ సినిమా నాగార్జున గత సినిమాల తరహాలో రొమాంటిక్ కోణంలో ఉండదట. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో కాజల్ కూడ సున్నితమైన పాత్రలో కనిపించదు. ఆమె పాత్ర చాలా చాలా రఫ్ అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగ్ మాజీ రా-ఏజెంట్ పాత్రలో నటిస్తుండగా కాజల్ కూడ రా-ఏజెంట్ పాత్రలోనే నటిస్తోంది. అది కూడ నాగార్జునకు అసిస్టెంట్ పాత్రలో. అంటే నాగార్జునతో కలిసి సీక్రెట్ మిషన్స్ చేయడం, పోరాటాలు అన్నీ చేస్తుందట. అందుకే ఆమె రైఫిల్ షూటింగ్, డిఫెన్స్ టెక్నీక్స్, మార్షల్ ఆర్ట్స్, వెపన్స్ హ్యాండిలింగ్ లాంటివి నేర్చుకుంటోందట. నాగ్ పక్కన ఎవర్ని తీసుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కాజల్ అగర్వాలే గుర్తొచ్చిందట. ఎందుకంటే ఆమె పొడుగ్గా ఉండి వెపన్స్ క్యారీ చేయగలదు కాబట్టి. అలా కాజల్ తన హైట్ మూలంగానే నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట.