వైరల్ : “RRR” నుంచి వచ్చే సాంగ్ ఎలా ఉండబోతుందో తెలుసా.!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి ఒకొకటిగా కీలక అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించినటువంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల అభిమానులు వాటి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ వచ్చే 26న ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్, దర్శకుడు రాజమౌళి నిన్న కన్ఫర్మ్ చేశారు. అయితే అసలు ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో అనేది RRR బృందం ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సాంగ్ అయితే మిగతా పాటల్లా లిరికల్ గా ఉందట కంప్లీట్ భావోద్వేగ పూరిత పాట కాబట్టి విజువల్స్ తోనే ఉంటుందట.

అన్ని భాషల్లో కూడా ఇలాగే రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. విజువల్ గా ఎమోషన్స్ తో అంటే ఇంకా మంచి అంచనాలు ఏర్పడతాయి. పైగా రాజమౌళి ఎలాంటి నటుడు నుంచి అయినా చాలా మంచి ఎమోషన్స్ ని రాబట్టగలరు. మరి ఈ సాంగ్ లో ఎంత బలమైన ఎమోషన్స్ ఉన్నాయో చూడాలి. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది.