మెగాస్టార్ సినిమాలో హాట్ యాంకర్ సాంగ్ ఇందుకేనట.!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం రెండు భారీ సినిమాలు ఏకకాలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న “భోళా శంకర్” ఒకటి. తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా దీనిని చేస్తున్నారు.

అయితే భారీ భారీ సెట్టింగులు వేసి కలకత్తా నేపథ్యాన్ని ఇక్కడే సృష్టించి సినిమా షురూ చెయ్యగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకొచ్చి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒక ఐటెం సాంగ్ చేస్తుంది అని..

అయితే అసలు రష్మీ ఈ సినిమాలో అవకాశం ఎలా దక్కించుకుందా అనే ప్రశ్న రాగా దానికి సమాధానం కూడా ఇప్పుడు తెలుస్తుంది. దానికి కారణం మరెవరో కాదట స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే.. తానే సినిమా మేకర్స్ కి రష్మీ పేరుని సజెస్ట్ చెయ్యడంతో ఆమె ఈ భారీ ఆఫర్ ని దక్కించుకుంది.