Pawan : పవన్ భారీ సినిమాలో ఈ హాట్ బ్యూటీని రీప్లేస్ చేసిన ఇంకో బ్యూటీ.!

Pawan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దర్శకుడు సాగర్ కే చంద్ర తో “భీమ్లా నాయక్” సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్ లో ఉండగానే.. కాదు దాని కన్నా ముందే స్టార్ట్ చేసిన భారీ బడ్జెట్ సినిమా “హరిహర వీరమల్లు”. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన సినిమా ఇది.

పవన్ కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో అలాగే మొదటగా పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన సినిమా ఇది. అందుకే పవన్ ప్రత్యేకంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో క్యాస్టింగ్ పరంగా కూడా క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

హీరోయిన్ గా ఆల్రెడీ టాలీవుడ్ హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమెతో పాటుగా హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా ఈ నటిస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఈమె పాత్ర పైనే క్లారిటీ తెలుస్తుంది.

ఈమెని భర్తీ చేస్తూ అదే బాలీవుడ్ కి చెందిన ఇంకో హాట్ బ్యూటీ ని తీసుకుంటున్నారట. ఆమెనే నర్గీస్ ఫక్రి. “క్రిష్ 3”, “రాక్ స్టార్” తదితర ఎన్నో చిత్రాల్లో ఈమె నటించింది. ఇదే ఈ సినిమాపై లేటెస్ట్ సమాచారం.