సస్పెన్స్ గా మారిన ఈ గ్లామరస్ యంగ్ హీరోయిన్ పెళ్లి.?

ప్రస్తుతం ఒక్క సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి యంగ్ అండ్ గ్లామస్ హీరోయిన్ కియారా అద్వానీ. మరి ఈ హీరోయిన్ తెలుగులో అయితే భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ బ్యూటీ తర్వాత మరిన్ని సినిమాలు చేయగా ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ సినిమాని చేస్తుంది.

అయితే ఇంకా మరిన్ని భారీ సినిమాలు ఈమె ఓకే చెయ్యగా ఇప్పుడు షాకింగ్ టాక్ అయితే ఆమెపై ఇప్పుడు వినిపించడం ఆసక్తిగా మారింది. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని పలు గాసిప్స్ బయటకి వస్తుండగా అసలు పెళ్లి ఎప్పుడు అలాగే పెళ్లి రోజు ఏది ఫిక్స్ అయ్యింది అనేది మరింత సస్పెన్స్ గా మారింది.

అయితే ఇప్పుడు కియారా పెళ్లి డిసెంబర్ లోనే ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుండగా ఈ డిసెంబర్ లో డేట్ ఎప్పుడు అనేది బాలీవుడ్ వర్గాల్లో మంచి ఆసక్తిగా మారింది. మరోపక్క అయితే హన్సిక మోత్వానీ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కాగా ఇప్పుడు కియారా కి ఏ డేట్ అనౌన్స్ చేస్తారు అనేది కేజ్రీగా మారిపోయింది.