బాలయ్య సినిమానే నమ్ముకున్న గ్లామరస్ హీరోయిన్.!

This Glamorous Heroine All Hopes On Balayya Movie | Telugu Rajyam

సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమందికి ఎంతో టాలెంట్ ఉండి మంచి అందం కూడా ఉన్నా సరైన ఛాన్స్ లు ఎందుకు లేవు అంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. ఈ పరిస్థితి ఎక్కువగా హీరోయిన్స్ లోనే కనిపిస్తుంది. మరి ఈ కోవకే చెందుతుంది గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

టాలీవుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా కూడా పెద్దగా అవకాశాలు లేవు. మరి ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో చేసిన “అఖండ”లో నటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫలితంపైనే తాను మొత్తం నమ్మకం పెట్టుకున్నట్టు అర్ధం అవుతుంది.

లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నానని చెప్తుంది. చాలా కాలంగా మంచి ఆఫర్స్ లేవు అఖండ అయినా నా కెరీర్ ని మారుస్తుందని అనుకుంటున్నట్టు ఓపెన్ గా చెప్పింది. మరి ఈ సినిమా అయినా తన ఫేట్ మారుస్తుందో లేదో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles