“వాల్తేరు వీరయ్య” లో బంపరాఫర్ అందుకున్న ఈ గ్లామరస్ బ్యూటీ.!

తెలుగు సినిమా రారాజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆల్రెడీ నటించిన గత రెండు సినిమాలతో పోలిస్తే భారీ హైప్ ఉన్న లేటెస్ట్ చిత్రం మాత్రం “వాల్తేరు వీరయ్య”. తన ఫ్యాన్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్ ని మళ్ళీ పాత రోజుల్లోలా చూపించి అయితే అదరగొట్టింది.

రీసెంట్ గా వచ్చిన టైటిల్ టీజర్ కూడా దుమ్ము లేపగా అక్కడ నుంచి మెగా ఫ్యాన్స్ లో ఈ చిత్రం క్రేజీ గా మారింది. ఇక ఈ క్రేజీ చిత్రం షూటింగ్ కూడా ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో హాట్ బ్యూటీ అయితే బంపరాఫర్ అందుకున్నట్టుగా తెలుస్తుంది.

మిస్ వరల్డ్ అయినటువంటి బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా వాల్తేరు వీరయ్య లో ఓ మాస్ ఐటెం సాంగ్ చేయనున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఆల్రెడీ రామ్ తో బోయపాటి సినిమాలో ఆల్రెడీ లాక్ అయ్యిన ఈ బ్యూటీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య లాంటి భారీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

మరి ఈ సాంగ్ అయితే రవితేజ చిరు లతో ఉండగా ఇద్దరితో కలిసి ఈమె కనిపించనుందట. మరి ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ కూడా సూపర్ సాంగ్ ని కంపోజ్ చెయ్యగా థియేటర్స్ లో కూడా ఈ సాంగ్ అదిరిపోతుంది అని ఇన్సైడ్ టాక్.