Gabbar Singh : ఏంటి? “గబ్బర్ సింగ్” లో ఈ పాట పాడింది నెక్స్ట్ పాడేది దర్శకుడేనా..!

gabbar singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక హిట్ గాని పడితే దాని ప్రభావం ఏ లెవెల్లో ఉంటుందో తన క్రేజ్ తో చూపించిన చిత్రం “గబ్బర్ సింగ్”. హిందీ హిట్ సినిమా దబాంగ్ కి రీమేక్ గా దర్శకుడు హరీష్ శంకర్ చాలా మార్పులు చేర్పులు చేసి ఒక పక్కా బ్లాక్ బస్టర్ గా దీన్ని రూపొందించారు.
అయితే ఈ క్రేజీ సినిమా అప్పట్లో 300 కి పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్లతో అనేక రికార్డులు సెట్ చేసింది. దీనితో వీరి నుంచి రెండో సినిమా మళ్ళీ ఇన్నాళ్లకు “భవదీయుడు భగత్ సింగ్” అంటూ వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇదిలా ఉండగా గబ్బర్ సింగ్ పై ఒక ఆసక్తికర నిజం బయటకి వచ్చింది. ఈ సినిమాలో కోటా శ్రీనివాస్ పై ఒక సాంగ్ ఉంటుంది. మందు బాబులం మేము మందుబాబులం అంటూ ఉంటుంది. అయితే ఈరోజు గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి పదేళ్లు కావడంతో సోషల్ మీడియాలో ఆ ట్రెండ్ నడుస్తుండగా ఆ సాంగ్ లో ఒక లైన్ హరీష్ శంకర్ పాడారని దానిపై స్పందిస్తూ..
అది నిజమే అని ఆ దర్శకుడు కన్ఫర్మ్ చేసాడు. అంతే కాకుండా ఎక్కడ పాడాడో కూడా లైన్ వీడియో కూడా పోస్ట్ చేసాడు. దీనితో చాలా మందికి తెలియని ఒక నిజం ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్క సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోనే కాకుండా తాము చేస్తున్న నెక్స్ట్ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” లో కూడా పాట పాడుతా అని ప్రామిస్ చేసారు అది ఇంకా పెండింగ్ లో ఉందని తెలిపాడు అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇదే దర్సకునితో పవన్ కి మరో పాట వస్తుందని చెప్పాలి. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
https://twitter.com/ThisIsDSP/status/1524318551472934913?s=20&t=kH-3n8DuASi58dVJnNIc0Q