RRR : ఈ ఏడాది స్టార్టింగ్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్న భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ట్రిపుల్ ఆర్(RRR) అని అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ పాన్ ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్ కరోనా తీవ్రత పెరిగిపోవడం మూలాన విడుదల ఆగిపోవాల్సి వచ్చింది.
అయితే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఒక్కొక్కరిగా అనేక మంది ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ ఈ సినిమా క్యాస్ట్ లో చేరారు. అలా చేరిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో మరియు హీరోయిన్ అయినటువంటి అజయ్ దేవగణ్ మరియు అలియా భట్ లు కూడా ఒకరు.
మరి ఇప్పుడు ఈ ఇద్దరు ఈ భారీ సినిమాకి ఎంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ బయటకొచ్చింది. మరి ఈ టాక్ ప్రకారం ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తన పాత్రకి ఏకంగా 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా హీరోయిన్ అలియా భట్ మాత్రం 9 కోట్ల రూపాయలు తీసుకుందట.
అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరి పాత్రలు చాలా లిమిటెడ్ గానే ఉంటాయట కానీ వారు ఈ భారీ మొత్తంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో ఇపుడు వీరి రెమ్యునరేష్ లే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పరిశీలనలో ఉన్నారు.