Allu Arjun : “పుష్ప” రాజ్ నటనకి బాలీవుడ్ నటుడు ఫిదా..తన కోరిక బయటపెట్టాడు

Allu Arjun : లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం “పుష్ప పార్ట్ 1” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సాలిడ్ సినిమా పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క నటుడు నటన కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. మరి ఈ సినిమా అంతా అల్లు అర్జున్ పాత్రపైనే తిరుగుతుంది.. అలా తన నటనకి చాలా స్కోప్ ఉండడం దానిని బన్నీ కూడా సూపర్బ్ గా పండించడంతో మొదటి రోజు నుంచే ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిసాయి.

ఇక హిందీ ఆడియెన్స్ లో కానీ స్టార్ హీరోస్ లో కానీ అల్లు అర్జున్ నటన చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. లేటెస్ట్ గా అయితే బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అయ్యినటువంటి అనుపమ్ ఖేర్ కూడా పుష్ప సినిమా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పుష్ప సినిమా పైసా వసూల్ బొమ్మ అని ఒక రాక్ స్టార్ లా అల్లు అర్జున్ సినిమాలో తన యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడని తెలిపారు. ఇక అలాగే నీతో నటించాలని కోరుకుంటున్నానని తన కోరిక బయటపెట్టారు. ఇలా బాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో స్క్రీన్ పంచుకోవాలని కోరుకోవడం ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పాలి.