ఎన్టీఆర్ 30 లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్? దీనిపై అసలు నిజం ఇదే.!

పాన్ ఇండియా సినిమా మీదకి తన టార్గెట్ ని ఎక్కు పెట్టిన రీసెంట్ బిగ్గెస్ట్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. తారక్ ఇప్పుడు నటించిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇక దీనితో ఎలాంటి హైప్ కావాలో అలాంటి హైప్ తన నెక్స్ట్ రెండు సినిమాలకి కూడా తెచ్చేసాడు.

మొదటగా వీటిలో దర్శకుడు కొరటాల శివతో అయితే ఒక బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా ని ప్లాన్ చేసాడు. దీనిపై వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ తోనే ఎనలేని హైప్ దీనిపై వచ్చేసింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఫిక్స్ కాలేదు.

కానీ రీసెంట్ గా ఒక గాసిప్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ఒక కీలక పాత్రలో నటిస్తుంది అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై అసలు నిజం తెలిసినట్టు వినిపిస్తుంది.

ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తన దగ్గరకు ఎవరూ రాలేదు ఎవరు ఈ సినిమా అప్రోచ్ అవ్వలేదని ఈ హీరోయిన్ తెలిపినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఇవన్నీ క్లియర్ అయ్యి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.