KGF Chapter 2 : ఇండస్ట్రీ బజ్ : “కేజీఎఫ్ 2” కి పోటీగా తన సినిమా దింపబోతున్న ఈ బిగ్ స్టార్.?

KGF Chapter 2 : జెనరల్ గానే ఓ భారీ సినిమా రిలీజ్ ఉంటుంది అంటే చిన్న హీరోల సినిమాలు విడుదల ఆగుతాయి. మరి అలా భారీ సినిమాలు కూడా భయపడేది మాత్రం పాన్ ఇండియా సినిమాలకి అని చెప్పాలి. ఇపుడు మన సౌత్ ఇండియన్ సినిమా నుంచి వస్తున్న భారీ సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మాస్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ సినిమా కేజీఎఫ్ కి కొనసాగింపుగా తీసిన చాప్టర్ 2 కి ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కన్నడ, తమిళ్ మళయాళం అలా తెలుగులో కూడా భారీ స్థాయి అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమా వస్తుంది అంటే మరో స్టార్ హీరో సినిమా కూడా ఆగాల్సిందే. కానీ సరిగ్గా ఇదే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ కి అంటే ఏప్రిల్ 14న తన సినిమా రిలీజ్ చేసేందుకు కోలీవుడ్ బిగ్ స్టార్ అయినటువంటి విజయ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ ఆక్షన్ డ్రామాపై తమిళ్ లో అయితే మంచి అంచనాలు ఉన్నాయ్. అలాగే విజయ్ సినిమాలు ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ చెయ్యకపోయినా ఒక్క తమిళ్ లోనే 300 కోట్ల మార్కెట్ ఉంది ఈ లెక్కన కేజీఎఫ్ 2 కి ఒకేరోజు కానీ రిలీజ్ అయితే తమిళ్ లో కాస్త కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా నడుస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన ఏమన్నా వస్తుందేమో చూడాలి.