ఇన్సెడ్ టాక్ : “భీమ్లా నాయక్” తో ఈ బిగ్ స్టార్ సినిమా కూడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు టాప్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ చిత్రం పోటీ తోనే ఆల్రెడీ హీట్ మొదలయ్యింది.

అయితే ఈ రేస్ లో ఉన్న చిత్రాలతో ఒకే డేట్ కి ఇంకో సినిమా లేదు ఇది మంచి విషయమే. కానీ ఇప్పుడు సరిగ్గా ఇదే డేట్ కి కోలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన “వలిమై” కూడా రిలీజ్ అయ్యే అవకాశం వుందని సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అసలే హాలీవుడ్ లెవెల్ ఏక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. సో టాలీవుడ్ లో కూడా కొన్ని వర్గాల ఆడియెన్స్ ని ఈ సినిమా ఆకర్షించే అవకాశం ఉంది. కానీ ఇంకా తెలుగు రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ కనుక డేట్ నిజమే అయితే భీమ్లా నాయక్ కి కొంచెం అయినా ఎఫెక్ట్ ఉండి తీరుతుంది.