“అఖండ” లో అత్యంత క్రూరంగా అతడి రోల్.!

నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ప్రాజెక్ట్ “అఖండ”. బాలయ్య మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రీసెంట్ గానే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ అదిరే అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ విలన్ రోల్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

కానీ ఈ రోల్ లో మాత్రం శ్రీకాంత్ అసలు ఎవరూ ఊహించని రీతిలో కనిపిస్తాడట. అంతే కాకుండా తన క్యారక్టరైజేషన్ ని కూడా బోయ మరో లెవెల్లో చెక్కారని శ్రీకాంత్ తెలిపారు. చాలా రగ్గుడ్ లుక్ లో రఫ్ యాటిట్యూడ్ తో అత్యంత క్రూరంగా తన పాత్రను బోయపాటి డిజైన్ చేసారని శ్రీకాంత్ తెలిపారు.

అంతే కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారని మరో ఆసక్తికరమైన లైన్ ని కూడా జోడించారు. ప్రస్తుతం అయితే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ కి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.