Poonam Kaur: కావాలనే పవన్ కళ్యాణ్ తో నటించకుండా చేశారు… పూనమ్ షాకింగ్ కామెంట్స్!

Poonam Kaur: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నటి పూనమ్ కౌర్ కు మధ్య ఒక వివాస్పద ఎపిసోడ్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. దాంతో ఎప్పుడో ముగిసిన కథను మళ్ళీ గుర్తు చేస్తూ ఈ భామకు ప్రశ్నలు సంధించడం, ఆమె దానికి సమాధానం ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పవన్ తో నటించారు కదా.. ఆయన గురించి చెప్పండి అని అడిగిన ప్రశ్నకు.. పూనమ్.. నేను చేయలేదు.. చేయనివ్వలేదు చాలామంది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన గురించి ఏమి చెప్పినా వివాదమే అవుతుంది. పాజిటివ్ గా చెప్పినా, నెగిటివ్ గానే అర్ధం చేసుకుంటున్నారు కాబట్టి తాను ఆయన గురించి ఏం చెప్పను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫొటో చూడగానే ఆమె అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది!అంటూ పూనమ్ అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే .. దేవుడా ! పవన్ కళ్యాణ్ తో అయింది చాలు అంటూ పూనమ్ దండం పెట్టడం అందరినీ ఎన్నో సందేహాలకు గురి చేసింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే చాలా కాలం తరువాత సినిమాల్లో నటిస్తున్న పూనమ్ కౌర్ ఇటీవలే నాతిచరామి అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కాగా ఆ చిత్రం ఓటీటీల్లోనూ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ప్రమోషన్లో పాల్గొన్న పూనమ్ … తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు.