టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వని వారు ఎవరూ లేరు. అలాంటిది తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిరంజీవికి కండిషన్ పెట్టాడు. ఇంతకూ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
నిజానికి చిరంజీవికి, సల్మాన్ కు మధ్య మంచి స్నేహబంధం ఉంది. దీంతో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ కు గెస్ట్ రోల్ ఇచ్చారు. ఇటీవలే సల్మాన్ సెట్ లో కూడా అడుగుపెట్టాడు. అయితే సల్మాన్ చిరంజీవితో ఈ సినిమాకు తాను రెమ్యూనరేషన్ తీసుకోనని.. బలవంతం చేస్తే సెట్ లో నుంచి వెళ్లిపోతానని కండిషన్ పెట్టాడట. చిరంజీవి మీద ఉన్న అభిమానంతో మాత్రమే చేస్తున్నానని.. డబ్బు కోసం కాదని అన్నాడట సల్మాన్ ఖాన్. మొత్తానికి వీరి మధ్య స్నేహబంధంను చూసి నిర్మాతలు షాక్ అవుతున్నట్లు తెలిసింది.