Tolly Wood Comedians: ఈ సీనియర్ కమెడియన్స్ ను ఇండస్ట్రీకీ కావాలనే దూరం పెట్టారా?

Tolly Wood Comedians: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లతో పాటు కమెడియన్ లకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ కమెడియన్ లు ఉన్నారు. ఇలాంటి వారిలో బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్, కోట శ్రీనివాస్ రావు వేణుమాధవ్,30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ వంటి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఉన్నారు.ఇలా వీరందరూ ఒకప్పుడు ప్రతి ఒక్క హీరో సినిమాల్లో ఉంటూ ఎంతో అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించారు. అయితే ప్రస్తుతం వీరిలో కొంతమంది కన్నుమూసిన మరికొంతమంది వయసు పైబడటంతో కావాలి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే కొంతమందికి కమెడియన్స్ కి మాత్రం అవకాశాలు రావడం లేదనే చెప్పవచ్చు.అయితే వారికి అవకాశాలు రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మాత్రం తెలియడం లేదు. కొందరికి ఇండస్ట్రీలో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ కమెడియన్స్ ఉండటం వల్ల వీరికి అవకాశాలు రావడంలేదని, కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టారని వార్తలు కూడా వినపడుతున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది యువ దర్శకులు కమెడియన్స్ రావడంతో సీనియర్ నటీనటులను తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.ఏదో సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు వారి సినిమాలలో సీనియర్ కమెడియన్స్ కు అవకాశాలు ఇస్తున్నారు కానీ ప్రస్తుత యువ దర్శకులు మాత్రం వీరి గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఎల్.బి.శ్రీరామ్, కృష్ణభగవాన్, బ్రహ్మానందం,పృథ్వి రాజ్ వంటి కమెడియన్స్ నటించడానికి సిద్ధంగా ఉన్న వీరికి అవకాశాలు రాకపోవడంతో మీరు కావాలనే ఇలా దూరమయ్యారా లేకపోతే దూరం పెడుతుందన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.