పోకిరి సినిమాని మిస్ చేసుకున్న సూపర్ హీరోయిన్స్ వీళ్లే

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్స్ కొన్ని అవకాశాలను వదులుకొని జీవితాంతం ఎంతో బాధపడుతూ ఉంటారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయి.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన పోకిరి సినిమా గురించి అందరికీ తెలిసిందే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా జంటగా నటించిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 28 వ తేదీ విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో హీరో ఇంకా ఇలియానా ఎంతో అద్భుతంగా సెట్ అయిందని అందరూ భావించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఇలియానా కన్నా ముందుగా పలువురు హీరోయిన్లను పూరిజగన్నాథ్ ను సంప్రదించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ముద్దుగుమ్మలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం ఇలియానా అందుకుంది. దీంతో ఇలియానా స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.

పోకిరి సినిమా కోసం ఇలియానా కన్నా ముందుగా దర్శకుడు కంగనా రౌనత్ ను సంప్రదించారు. ఈ సినిమా చేసే సమయంలో కంగనా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు. ఇక ఈ సినిమాకి కంగన నో చెప్పడంతో దీపికా పదుకొనే, అయేషా టాకియా, పార్వతి మెల్టన్ వంటి హీరోయిన్లను సంప్రదించారు.ఇక వీరందరూ కూడా పలు కారణాల వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి ఎంతో బాధపడ్డారని చెప్పాలి.