Sreeleela: మరో ఫ్లాప్ మూటగట్టుకున్న శ్రీ లీల… వరుస ఫ్లాప్ లకు అదే కారణమా?

Sreeleela: పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె అనంతరం రవితేజతో ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో శ్రీ లీలకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు 8 సినిమాలలో నటించిన ఈమెకు మూడు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లో మాత్రం రాలేదని చెప్పాలి.

తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాలో శ్రీ లీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పాలి కేవలం పాటలలో డాన్స్ వేయడానికి మాత్రమే తీసుకున్నారా అనే విధంగా ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న శ్రీలీలకు సరైన సక్సెస్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా శ్రీ లీల సద్వినియోగం చేసుకోవడమే ఈమె ఫ్లాప్ సినిమాలకు కారణమని తెలుస్తోంది. సినిమాలు చేయడం కాస్త ఆలస్యమైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకున్నప్పుడే సక్సెస్ వస్తుందని లేదంటే ఇలాంటి రిజల్ట్స్ ఎదుర్కోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు . అదేవిధంగా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు నాగచైతన్య తోను అలాగే అఖిల్ తో కూడా సినిమాలు కమిట్ అయ్యారు. మరి ఈ సినిమాలైనా ఈమెకు సక్సెస్ అందిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.