అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా వెండి తెరకు పరిచయమైనా….నాగార్జున తన టాలెంట్ తో స్టార్ హీరో గా ఎదిగాడు. అయితే అందరి హీరోల్లా సేఫ్ గేమ్ ఆడకుండా నాగార్జున తన కెరీర్ మొత్తం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది దర్శకులకి, టెక్నిషన్స్ ని తెలుగు సినిమాకు ఇంట్రడ్యూస్ చేసాడు.
తన కెరీర్ ని ఒక మలుపు తిప్పిన ‘శివ’ సినిమాతో తెలుగు సినిమాకు రామ్ గోపాల్ వర్మను పరిచయం చేసిన నాగార్జున. అంతకముందు ‘గీతాంజలి’ సినిమాతో మణిరత్నం తెలుగు సినిమాకు పరిచయం చేసాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగు లో సినిమా చెయ్యలేదు.
అలాగే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో ‘నిర్ణయం’ సినిమా చేశారు. తర్వాత ‘చైతన్య’ చిత్రంతో ప్రతాప్ పోతన్‌ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ‘శాంతి క్రాంతి’ చిత్రంతో రవిచంద్ర.. ‘ప్రేమ యుద్ధంతో’ రాజేంద్ర సింగ్ బాబులను పరిచయం చేశారు. ‘సీతారాముల కళ్యాణం చుట్టము రారండి’ సినిమాతో వై వీ యస్ చౌదరి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాతతతో ‘క్రిమినల్’ సినిమా చేశారు. ‘సొగ్గాడే చిన్ని నాయనా’తో కళ్యాణ్ కృష్ణను పరిచయం చేశారు. దర్శకులే కాదు.. చాలా సాంకేతిక నిపుణులతో కలిసి నాగార్జున తెలుగు సినిమాలను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం నాగార్జున ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే ‘బిగ్ బాస్’ కొత్త సీసన్ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.