మొన్న రష్మిక.. ఇప్పుడు రెజీనా.. అరె ఏంట్రా ఇదీ.?

Then Rashmika Now Regina What Is This | Telugu Rajyam

సినిమాల ద్వారా వచ్చే సంపాదన ఎంతున్నా, సెలబ్రిటీలు కొన్ని రకాల బ్రాండులను ప్రమోట్ చేస్తూ, ఆయా బ్రాండులకు సంబంధించిన ప్రకటనల్లో తళుక్కున మెరవడం సర్వ సాధారణమే. అయితే, ఈ మధ్య ఇలాంటి యాడ్ షూట్స్‌కి సంబంధించి సెలబ్రిటీలకు, నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తవమవుతున్న సంగతి తెలిసిందే.

ఓ అండర్ వేర్ యాడ్ షూట్‌లో పాల్గొన్నందుకు నిన్న మొన్నటి వరకూ రష్మికా మండన్నాని నెటిజన్లు ఫుల్ల్‌గా ఓ రౌండు వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతటి కష్టమే హాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ ఆల్కహాల్ కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్‌లో భాగంగా రెజీనా చేతిలో ఆల్కహాల్ గ్లాసుతో కనిపించిన ఫోటో ఒకటి నెట్టింట్లో పోస్ట్ చేసింది రెజీనా.

ఈ ఫోటో చూసి, నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అంత క్రేజ్ ఉన్న రష్మికనే ఆడిపోసుకున్న నెటిజన్లు రెజీనాని ఒప్పుకుంటారా.? డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతావా.? అంటూ రెజీనాపై కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు. పాపం రెజీనా.. ఏం చేస్తుందో చూడాలి మరి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles