Pooja Hegde Thaggedhe Le : మొన్న ‘రాధేశ్యామ్’, ఇప్పుడు ‘బీస్ట్’: పూజా హెగ్దే ‘ఆ’ విషయంలో అస్సలు తగ్గేదేలె.!

Pooja Hegde Thaggedhe Le : చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది బుట్ట బొమ్మ పూజా హెగ్దే. చేతిలో డజన్ల కొద్దీ సినిమాలుండడమే కాదు, వరుసగా ఒక్కోటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయ్ కూడా.

మొన్నీ మధ్యనే ‘రాధేశ్యామ్’‌తో ప్రేక్షకుల్ని పలకరించింది పూజా హెగ్దే. సినిమా రిజల్ట్ ఎలా వున్నా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే మంచి మార్కులే కొట్టేసింది. ఇక, ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్‌కి ముందు పూజాహెగ్దే పడిన కష్టం అంతా ఇంతా కాదు.

ప్రమోషన్ల పరంగా పూజా చాలా చాలా కష్టపడింది. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు, సోషల్ మీడియాలో హాట్ హాట్ స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుని, మీడియాకి మంచి స్టఫ్ ఇచ్చింది.

అలాగే, ఇప్పుడు పూజా హెగ్దే నటించిన ‘బీస్ట్’ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. తమిళ హీరో విజయ్ సరసన పూజా హెగ్దే తళుకు బెళుకులు అదరహో అనిపించనున్నాయ్ ఈ సినిమాలో.

ఇప్పటికే ‘అరబిక్ కుత్తూ..’ సాంగ్‌తో విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది ‘బీస్ట్’ సినిమాపై. ప్రమోషన్లలో భాగంగా పూజా హెగ్దే మళ్లీ ఈ సినిమా బాధ్యతను కూడా తన భుజాలపైనే వేసుకుంది.

ఓ పక్క ఈ సినిమాకి నెగిటివ్ ప్రచారం వస్తున్నా, సినిమాపై అంచనాలు మాత్రం వేరే లెవల్‌లో వున్నాయంటే, అతిశయోక్తి కాదు, ఆ అంచనాల్ని మరింత పెంచేలా బుట్టబొమ్మ తన ప్రమోటింగ్ టాలెంట్ చూపిస్తోంది. చూడాలి మరి, ఈ సినిమాతోనూ పూజా హెగ్దే తన స్టార్‌డమ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళుతుందేమో.