మీకు గుర్తుందా? ఢిల్లీలోని బాబా కా దాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హోటల్ కు కస్టమర్ల సంఖ్య ఒకేసారి పెరిగింది. 80 ఏళ్ల తాత హోటల్ లాక్ డౌన్ కారణంగా సరిగ్గా నడవక.. ఆ తాత ఫ్యామిలీకి పూట గడవడం కష్టంగా మారడంతో.. ఓ కస్టమర్ ఆ తాత బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఆ తాత హోటల్ ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆ హోటల్ కు ఇప్పుడు కస్టమర్లు క్యూ కడుతున్నారు.
తాజాగా.. బాబా కా దాబా తరహాలోనే మరో వీడియో వైరల్ అయింది. అది కాంజీ బడా అనే చిరుతిండి బండికి సంబంధించింది. నారాయణ్ సింగ్. వయసు 90 ఏళ్లు. చిరుతిళ్ల బండి పెట్టుకొని తన పొట్ట నింపుకుంటున్నాడు. సేమ్.. కరోనా వల్ల రూపాయి గిరాకీ లేదు.
అతడి బండి వద్దకు వెళ్లిన ఓ యువతి.. ఆ తాత చిరుతిండి బండి గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే.. సేమ్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే.. ఆగ్రాలోని ప్రజలంతా అక్కడికి వెళ్లి ఆ తాత చేసిన చిరుతిళ్లను తిని ఫుల్లు గిరాకీ ఇస్తున్నారు.
ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ కూడా కాంజీ బడా వద్దకు వెళ్లి.. నారాయణ్ సింగ్ తయారు చేసిన చిరుతిళ్లు తిని మెచ్చుకున్నాడు.
లాక్ డౌన్ వల్ల వ్యాపారం మొత్తం దెబ్బతిన్నదని.. ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని.. కాస్తో కూస్తో ఇప్పుడే కూడబెట్టుకోగలుగుతున్నానని నారాయణ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.