పెళ్లయిన 22 రోజులకే భర్త ను చంపాలని ప్లాన్ వేసిన భార్య.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకోవడం మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న వాళ్లని చెప్పడానికి వెనకాడటం లేదు. ఇలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకునే. ఇష్టంలేని పెళ్లి చేశారని ఆ కారణంతో పెళ్లి జరిగిన రెండు రోజులకి భర్తను చంపాలని ప్లాన్ చేసింది చివరికి తానే ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

తేనీ జిల్లా కంభం కురంగ్‌మయాన్ వీధికి చెందిన గౌతమ్‌కు గత నెల 10వ తేదీన అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరితో వివాహం జరిగింది. అయితే ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడంతో ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. తన స్నేహితుడు నిరంజన్ తో కలిసి తన భర్తను చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో తన భర్తతో కలిసి బయటకు వెళ్లింది.అయితే బండి పంచర్ కావడంతో కొందరు దుండగులు కారులో వచ్చి అతనిని చితకబాదారు.అయితే ఆ కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ కావడంతో కారు నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు.

గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనేశ్వరి భయంతో వణికిపోయింది. ఈ క్రమంలోనే కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో తన పేరు ఎక్కడ బయటపడుతుందో నన్న భయంతో భువనేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.