Nani: ఫుల్ అవకాయ సీజన్ మొత్తం బ్లాక్ చేశాం.. వైరల్ గా మారిన నాని ట్వీట్..!

Nani: నాచురల్ స్టార్ నాని తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విడుదలైన శ్యాం సింగరాయి సినిమా మంచి విజయాన్ని సాధించింది. కరోనా వల్ల థియేటర్లు మూతబడి సినిమాలన్నీ ఓటీటీ విడుదల చేయవలసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్లు తెచ్చుకొని సినిమాలు అన్ని థియేటర్లలో విడుదలవుతున్నాయి. నాచురల్ స్టార్ నాని నటించిన v, టక్ జగదీష్ వంటి సినిమాలు కరోనా కారణంగా ఓటీటీ విడుదలై మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. కానీ శ్యామ్ సింగరాయి సినిమా మాత్రం థియేటర్లలో విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది.

ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే సుందారానికి””అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ సినిమాలో ‘రాజా రాణి ‘ఫేం నజ్రియా నజీమ్‌ చాలా గ్యాప్ తర్వాత తిరిగి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మొత్తం కామెడీ నేపత్యం లో తెరకెక్కుతోంది. ఐతే ఇటీవల ఆర్ఆర్ఆర్ ,భీమ్లానాయక్‌ వంటి సినిమాలు రెండేసి విడుదల తేదీలను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు నాని కూడా వారికి ఏ మాత్రం తీసిపోకుండా ఏకంగా 7 తేదీలను విడుదల చేశాడు.

తాజాగా నాని సోషల్ మీడియాలో సినిమా విడుదల తేదీలు గురించి ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన
ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు తన సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశాడు. ” మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే.. మేము చేయకూడదా? ఫుల్ ఆవకాయ సీజన్ మొత్తం బ్లాక్ చేశాం.మెల్లిగా డిసైడ్ చేస్తాం..” అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.