ఆ పార్టీల మద్దతు బీజేపీకే కాబట్టి ఏమీ అనరు: ఉండవల్లి

తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని అక్కడ కొన్ని విషయాలు బయట పెట్టాడు. మనం ఎటు పోతున్నామో తెలియని పరిస్థితిలా ఉంది అంటూ.. చదువుకుంటున్న వాళ్లు కూడా సంకుచితంగా ఆలోచిస్తున్నారని అన్నాడు. ప్రపంచం మొత్తం గౌరవిస్తుందని.. ఇతర దేశాల్లో కూడా మన సంప్రదాయాలు ఉంటున్నాయని అన్నాడు.

కాంగ్రెస్, ఇతర పార్టీలో ఉన్నవారు బీజేపీ లోకి వెళ్లడం ఆశ్చర్యం కలుగుతుందని.. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చేరుతున్నారని అన్నాడు. నిజానికి బీజేపీ ఐడియాలజీ తెలియకుండా పదవులకోసం వెళ్తున్నారు అంటూ.. కాంగ్రెస్ సెక్యులరిజం, కమ్యూనిస్టులు సోషలిజం, బీజేపీది హిందూయిజం అని అన్నాడు. బీజేపీ మతం విషయంలో సక్సెస్ అయింది అని.. రాష్ట్రంలో వైకాపా, తేదేపా, జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్…