ఐపీఎల్ లో నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన స్టార్ హీరో.. వీడియో వైరల్!

ఐపీఎల్ గత రాత్రి ఘనంగా ముగింపు వేడుకలను జరుపుకున్నాయి. ఈ ముగింపు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే అభిమానులతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఈ వేదికపై సందడి చేసినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ ఐపీఎల్ ఫైనల్స్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ కన్నడ హీరో యశ్ నటించిన కే జి ఎఫ్ చిత్రం నుంచి అలాగే విజయ్ నటించిన మాస్టర్ చిత్రం నుంచి పాటలకు డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఎంతటి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ పాటకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఎంతోమంది ఈ నాటు నాటు స్టెప్పులను చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇకపోతే ఐపీఎల్ ముగింపు వేడుకలలో భాగంగా తెలుగులో నాటు నాటు సాంగ్ ప్లే చేయగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ పాటకు అద్భుతమైన స్టెప్స్ వేస్తూ అందరినీ సందడి చేశారు. అయితే ఐపీఎల్ ముగింపు వేడుకలలో ఇలా తెలుగు పాటలు ప్లే చేయడం తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ ముగింపు వేడుకలకు దూరంగా ఉంది.ఈ క్రమంలోని ఈ ఏడాది ఎంతో ఘనంగా ఐపీఎల్ ముగింపు వేడుకలలో పాల్గొన్నారు.