Tabu: వామ్మో ఆ హీరోకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ టబు.. ఎందుకంటే?

Tabu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన సినిమా అలా వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో అల్లు అర్జున్ తల్లి పాత్రలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషించారు. తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని ముందే ఊహించిన బాలీవుడ్ నటులు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించారు.

ఈ క్రమంలోనే హీరో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా, కృతి సనన్‌ హీరోయిన్‌గా ‘షెహజాదా’అనే టైటిల్ తో ఈ సినిమా హిందీలో తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ వచ్చే ఏడాది నవంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. ఇకపోతే తెలుగులో టబు పాత్రలు హిందీలో మనీషా కోయిరాలా నటిస్తున్నారు.
రోహిత్‌ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా హీరో కార్తీక్ దర్శకుడు రాహుల్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారడంతో ఈ ఫోటో పై స్పందించిన టబు తనదైన శైలిలో హీరో కార్తీక్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దర్శకుడు రోహిత్ తో పనిచేయడం చాలా బాగుంది అంటూ కార్తీక్ చెప్పడంతో ఈ ఫోటో పై స్పందించిన టబు ఈ సినిమాను జాగ్రత్తగా తీయాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక టబుకి రిప్లై ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ మీ సినిమాని మేము ఏదో ప్రేమతో తీస్తున్నాము అంటూ రిప్లై ఇచ్చారు.