సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వాళ్లకు సుధాకర్ రెడ్డి ఎంతో సుపరిచితమే. ఈయన కేవలం నటుడుగా మాత్రమే కాకుండా రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే వృత్తిపరంగా ఈయన ఓ గొప్ప వైద్యుడు కూడా.ఈ విధంగా వైద్యుడిగా స్థిరపడిన ప్రభాకర్ రెడ్డి కేవలం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా ఒక వైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు తన వృత్తిపరమైన జీవితానికి కూడా న్యాయం చేశారని చెప్పాలి. ఇకపోతే చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎన్నో భూములను కొన్నారు. అలాగే ఎన్నో సినిమా థియేటర్లను కూడా నిర్మించారు. ఈ విధంగా ఈయనకొన్న భూములను చిత్ర పరిశ్రమకు దానం చేశారు. ప్రస్తుతం ఆ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుందని చెప్పాలి. ఇలా వందల కోట్ల విలువచేసే భూములను దానధర్మాలు చేసిన ఈయనను ఇప్పటికి చిత్ర పరిశ్రమలో దైవ సమానంగా భావిస్తారు.
ఇలా నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన ఈయన తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు అయితే ఈయనకు నలుగురు కుమార్తెలు. ఇలా వందల కోట్ల దానధర్మాలు చేసిన సుధాకర్ రెడ్డి ఆయన కూతుర్లకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా పెళ్లిళ్లు చేసి పంపారు. అయితే ఈయనలో ఉన్న మంచితనం గుర్తించిన కొందరు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులు వీరి కూతుర్లను తన నుంచి రూపాయి కూడా ఆశించకుండా పెళ్లి చేసుకోవడంతో ఈయన తన కూతుర్లకు ఏ విధమైనటువంటి కట్న కానుకలు ఇవ్వలేదు.