Rajamouli: ఆ విషయంలో రాజమౌళి దూరంగా ఉన్నారా.. ఇందులో నిజమెంత?

Rajamouli: టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల విడుదల తేదీ వాయిదా పడింది. ఇకపోతే రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయనున్నారు. దీంతో అందుకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు అని కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు సంబంధించిన పనులకు, ఆలోచనలకు దూరంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా రాజమౌళి ఖాళీ సమయంలో వెబ్ సిరీస్ లను చూడటంతోపాటు, నవలలు బుక్స్ చదువుతున్నారని సమాచారం. అలాగే తన భవిష్యత్తు సినిమాల కథలకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడానికి రాజమౌళి ఆసక్తి చూపించడం లేదు సిని వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాతే రాజమౌళి తరువాతి సినిమా పనులతో బిజీ కానున్నారు అని తెలుస్తోంది. ఈ విషయంపై జక్కన్న స్పందించకపోవడంతో రాజమౌళి మౌనం వెనుక అసలు సీక్రెట్ మాత్రం ఇదే అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి మళ్లీ ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ వాయిదా పడితే అది సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.