బాలకృష్ణకి నరసింహస్వామి సెంటిమెంట్ ఉండటానికి కారణం ఆ సినిమానే..?

టాలీవుడ్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు బాగా ఫేమస్. బాలకృష్ణ సినిమా అంటేనే అందరికీ ఆయన చెప్పిన డైలాగులే గుర్తుకు వస్తాయి. ఇదిలా ఉండగా బాలకృష్ణకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అంటే అపారమైన భక్తి అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే బాలకృష్ణ నటించిన సినిమాలలో దాదాపుగా నరసింహస్వామి పేరు ఉండేలాగా టైటిల్స్ ఉంటాయి. లక్ష్మీ నరసింహ, సమరసింహారెడ్డి, సింహ సింహం, బొబ్బిలి సింహం, సింహా వంటి సినిమాలలో నరసింహ స్వామీ పేరు ఉండేలా టైటిల్స్ ఉంటాయి.

బాలకృష్ణ నటించిన సినిమాలలో చాలా సినిమాలు సింహాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయంలో మొదటి షాట్ షూటింగ్ చేశారు. అంతే కాకుండా బాలకృష్ణ నటించిన సినిమాలు హిట్ అయిన తర్వాత కచ్చితంగా సింహాద్రి అప్పన్న ని దర్శించుకుంటారని అక్కడి అర్చకులు వెళ్ళడించారు. అంతే కాకుండా బాలకృష్ణ తో సినిమా తీసే దర్శకులు కూడా సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు స్క్రిప్ట్ మొత్తం దేవుడు పాదాల వద్ద ఉంచి పూజ చేసిన తర్వాతనే షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి కూడా ఇటీవల సింహాద్రి అప్పన్న దర్శించుకుని సినిమా స్క్రిప్ట్ ని దేవుడి పాదాల వద్ద ఉంచి పూజ చేయించాడని అక్కడి అర్చకులు వెల్లడించారు.

అయితే బాలకృష్ణకు ఈ నరసింహస్వామి సెంటిమెంట్ మొదలు కావడానికి బాలకృష్ణ నటించిన సినిమా సూపర్ హిట్ అవ్వటమే కారణం. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా సింహాద్రి అప్పన్న సన్నిదైన ప్రహ్లాదపురం వద్ద సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ సంఖ్యా శాస్త్రం జ్యోతిష్యుడు ఆ సినిమాకి టైటిల్ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి బాలకృష్ణ సినీ కెరీర్లోనే ఆణిముత్యంగా నిలిచింది. అందువల్ల ఆ సినిమా హిట్ అయినప్పటినుండి ఇప్పటివరకు బాలకృష్ణ కు సింహాద్రి అప్పన్న అంటే అపారమైన భక్తితో కూడిన నమ్మకం ఉంది. అందువల్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఉన్న భక్తితో బాలకృష్ణ తాను నటించే ప్రతి సినిమాలోను నరసింహస్వామి పేరు ఉండేలా లేదంటే ఆ సినిమా షూటింగ్ ఆ ప్రాంతంలో జరిగే లాగా డైరెక్టర్లు, నిర్మాతలకి చెబుతాడు.