ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్ ల మరణానికి కారణం ఒక్కటేనా..!

సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఇలాంటి ప్రపంచంలో జీవించి నటించాలని ఎంతోమంది కలలు కంటూ అవకాశాల కోసం తపన పడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటూ సినిమాయే ప్రపంచం, సినిమాయే జీవితం అంటూ వచ్చి ఒక వెలుగు వెలిగి చివరికి కనుమరుగైన వారెవరో చూద్దాం.

మహానటి సావిత్రి. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సావిత్రి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలతో చాలా సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మహానటి సావిత్రిగా పేరుపొందారు. అంతా బాగానే ఉంది. కానీ జెమినీ గణేషన్ రెండవ పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పాపం. జెమినీ గణేషన్ కు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అది తెలిసిన సావిత్రికి తన భర్తతో విభేదాలు వచ్చాయి. దూరం పెరిగింది. తాను నమ్మిన వారే తనను మోసం చేయడం, ఆమె చేసిన దానధర్మాలు, ఇంకా మిగిలిన ఆస్తిని ఇన్కమ్ టాక్స్ వాళ్లు సీజ్ చేయడం తో ఆమె ఎంతగానో కుంగిపోయారు. సినిమాలలో ఒక వెలుగు వెలిగి నిజ జీవితంలో పతనమై చివరకు మందుకు బానిసై ఆమె మరణించారు.

సౌందర్య. ఈ పేరును ఇంకా ఎవరు మర్చిపోలేదు. సినీ పరిశ్రమలో 10 సంవత్సరాల పాటు అగ్ర నటిగా పేరుపొందింది. దాదాపు అందరూ అగ్ర హీరోలతో ఇంకా కుర్ర హీరోలతో కూడా సౌందర్య నటించిన జరిగింది. తరువాత సౌందర్య కర్ణాటకకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది తర్వాత తన కుటుంబానికి తన భర్తకు మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తర్వాత ఏర్పడ్డ ఆర్థిక పరిస్థితులు ఆమెను రాజకీయాల వైపు నడిపించాయి. బిజెపి తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ కు విమానంలో బయలుదేరిన ఆమె మార్గమధ్యంలో విమానం కూలి చనిపోయారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె భర్త కోసం రాజకీయాల వైపు అడుగులు వేయడం, ప్రమాదవశాత్తు ఆమె చనిపోవడం జరిగింది.

శ్రీదేవి. శ్రీదేవి గురించి పరిచయం అక్కర్లేదు కొన్ని దశాబ్దాల పాటు అందరూ అగ్ర హీరోల సరసన నటించారు. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలలో శ్రీదేవి నటించడం జరిగింది. హిందీలో కూడా అగ్ర హీరోల సరసన నటించి ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు ప్రతిష్టలు సాధించారు. అయితే ఈమెను కూడా కుటుంబ కలహాలు వెంటాడాయి. పెళ్లయి పిల్లలు ఉన్న బోనీకపూర్ ను పెళ్లి చేసుకొని చాలా పెద్దతప్పే చేసింది శ్రీదేవి. పెళ్లి తర్వాత మొత్తం ఆస్తి భర్త చేతిలో పెట్టేసింది. భర్త ఆస్తిని తన మొదటి భార్య పిల్లలకు కూడా పంచడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇలా తన ముద్దుల భవిష్యత్తు పాడవుతుందని దుబాయ్లోని ఒక హోటల్లో అపస్మారగా స్థితిలో ఆమె తనువు చాలించారు.

ఇలా వెండితెరపై ఒక వెలుగు వెలిగి, ఎన్నో విజయాలను సొంతం చేసుకుని నిజ జీవితంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ల భర్తల ద్వారా పరిస్థితులు తారుమారై, నిజ జీవితంలో ఓడి కనుమరుగయ్యారు.