Mega Fight With Lady Super Star : చిరంజీవి, విజయశాంతి మధ్య సినీ ఫైట్ వుందంటూ అప్పట్లో ఓ చిన్న రగడ నడుస్తుండేంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాడంటూ ప్రచారం కూడా వుండేది. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిరు, విజయ శాంతి కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది.
ఈ సినిమా టైమ్‌లోనే వీరిద్దరి మధ్యా చిచ్చు రాజేశారని అంటుంటారు. ఆధిపత్యాన్ని, సక్సెస్ తాలూకు అహంకారాన్ని చిరంజీవి ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. విజయశాంతి కూడా అంతే కానీ, చెప్పుడు మాటలు కొన్ని సందర్భాల్లో దిగజార్చేస్తుంటాయ్. అలాగే విజయ శాంతి కూడా కొన్ని చెప్పుడు మాటల కారణంగా చిరంజీవిపై కోపం పెంచుకున్నారనీ అంటారు.
ఆ కోపం కారణంగానే ‘గ్యాంగ్‌లీడర్’ తర్వాత ఆయనతో కలిసి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే, ఆ తర్వాత ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఈ జంట సందడి చేసింది. అక్కడితో వారిద్దరి మధ్యా వివాదాలు సమసిపోయాయ్ అని కొందరంటారు. కానీ, విజయ శాంతిలో మాత్రం చిరు పట్ల ఈర్ష్య అలాగే వుందని మరికొందరు అంటారు.
ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బిజీగా వున్నారు. విజయ శాంతి మాత్రం రాజకీయాల్లో వున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఈ మధ్య విజయ శాంతి నటించారు. ఆ సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి, విజయ శాంతి చాలా స్నేహంగా మెలగడం అందరం చూశాం. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలకూ చోటు లేదని ఈ వేదికలో ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. కానీ, ఈ చిచ్చు మాత్రం ఇన్‌డైరెక్టుగా అలా ప్రచారమవుతూనే వుంది. (Mega Fight With Lady Super Star)
ఇక, విజయ శాంతికి సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ నటించడానికి ఆసక్తి చూపించడం లేదు.చిరంజీవితో, విజయ శాంతి మళ్లీ కలిసి నటిస్తే, చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. చూడాలి మరి, ఈ కాంబినేషన్ సెట్ అయ్యి ఫ్యాన్స్ కోరిక నెరవేరే సమయం వస్తుందేమో.