Mega Star: ఆ మూడు దారుణమైన మెగా కాంబినేషన్లు.!

Mega Star Chiranjeevi : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు దారుణమైన మెగా కాంబినేషన్లు.. మెగా అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ‘ఆచార్య’ సినిమా ఫెయిల్ అయ్యాక, మిగిలిన రెండు సినిమాల గురించిన చర్చ మెగా అభిమానుల్లో చాలా గట్టిగా జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా గుర్తుంది కదా.? అందులో పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాడు. ఓ ఫైట్ సీన్‌లో పవన్ కళ్యాణ్ మెరిశాడు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్.

ఇక, ‘బ్రూస్‌లీ’ సినిమా విషయానికొస్తే, చిరంజీవి – చరణ్ కలిసి నటించారు. ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించారు చిరంజీవి మీద. అతిథి పాత్రే అయినా.. చిరంజీవి పాత్రకి కాస్త లెంగ్త్ ఇచ్చారు. అదీ డిజాస్టరే అయ్యింది.

ముచ్చటా మూడోస్సారి మెగాస్టార్ ‘మెగా కాంబినేషన్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి, పవన్ – చిరంజీవి అయినా, చిరంజీవి – చరణ్ అయినా అభిమానులకు వెరీ వెరీ స్పెషల్ కాంబినేషన్. ఎక్కడ పొరపాటు జరుగుతోందో చిరంజీవి ఆలోచించుకోవాలి.

చిరంజీవి కోసం సినిమా చేయాల్సి వుండగా, కొరటాల శివ స్వయంగా.. చరణ్‌కి షాకిచ్చాడట.. సినిమాలో చరణ్ కూడా నటించాలని. ఈ విషయాన్ని కొరటాల చెప్పడం గమనార్హం. అంటే, ఈ వైఫల్యానికి కొరటాల బాధ్యత వహించాల్సిందే.