పెళ్లైన 19 రోజులకి నవ వధువు మృతి.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్యకాలంలో వరకట్న వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పెళ్లయిన మొదట్లో బాగానే ఉన్న కొందరు అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ, కొట్టడం చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. మరి కొందరు మహిళలు భర్తలు పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక నవ వధువు పెళ్లి అయిన 19 రోజులకే అనుమానాస్పద స్థితిలోమృతి చెంది కనిపించింది. అసలేం జరిగిందంటే..

ఈ ఘటన కర్ణాటకలోని హసన్ లో చోటు చేసుకుంది. ఆ యువతి వయస్సు 22 సంవత్సరాలు. పెళ్లయి కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది. పెళ్లయి నెల రోజులు కూడా కాకముందే సరిగ్గా పెళ్లయిన 19 రోజులకి అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. హసన్ జిల్లా అరకలగుడు తాలూకా హోలలగుడు గ్రామానికి చెందిన పిజా ఖానుమ్ అనే యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించి, డిసెంబర్ 2న షాజిల్ మహ్మద్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమె పెళ్లయిన తర్వాత భర్తతో కలసి సరదాగా టూర్ కి కూడా వెళ్లి వచ్చింది.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కొద్దిరోజుల పాటు సంతోషంగా గడిపిన ఆమె పెళ్లయిన 19 రోజులకి అత్తగారింట్లో విగతజీవిగా అనుమానాస్పద స్థితిలో కనిపించింది. తమ కూతురు స్నానానికి వెళ్ళిన సమయంలో గ్యాస్ గీజర్ ఆన్ చేసి, డోర్ క్లోజ్ చేసి పక్కగా ప్లాన్ వేసి ఆమెను చంపారు అని వివాహిత తల్లిదండ్రులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం తన కూతురిని పొట్టన పెట్టుకున్నారు అంటూ ఆ వివాహిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అవివాహిత భర్త, అత్తా, మామ, మరిది పై పోలీసులు వరకట్న వేధింపుల కింద నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఆ వివాహిత మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్లైన 19 రోజులకే తమ కూతురు విగతజీవిగా కనిపించడంతో అవివాహిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.