నాగచైతన్య థాంక్యూ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ విడుదలచేసిన మేకర్స్?

నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే లవ్ స్టోరీ బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య త్వరలోనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికా నాయర్ ప్రధాన పాత్రలలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన థ్యాంక్యూ చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని వచ్చే నెల 22వ తేదీ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా తాజాగా మూడవ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమాలో  ‘ఫేర్‌వెల్’ అంటూ సాగే పాటను సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా సందడి చేయనున్నారు. ఈ విధంగా ఈ సినిమా నుంచి చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇకపోతే నాగచైతన్య ఈ సినిమాతో పాటు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దూత అనే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో నాగచైతన్య నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మరొక సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.