మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అనుకున్నంత గా ఆడలేదు. పైగా రామ్ చరణ్ లుక్స్, నటన మీద చాలా విమర్శలు వచ్చాయి. అసలు “నీ మొఖానికి నువ్వు మెగా హీరోనా ” అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మొదటి సినిమా తో హిట్ కొట్టలేకపోయిన రామ్ చరణ్ తన రెండో సినిమా ‘మగధీర’ తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో, పునర్జన్మలో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ‘పోకిరి’ పేరిట ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ సృష్టించింది. దీనితో ఒక్కసారి గా రామ్ చరణ్ కి స్టార్డం వచ్చేసింది.
అయితే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ కి అప్పటివరకు హిట్లు ఏమి లేవు. అయినా కానీ, షూటింగ్ స్పాట్ కు టైం కు వచ్చేది కాదు అని..షాట్ రెడీ అయినా ఆలస్యం చేసేదని..దీంతో రాజమౌళి కూడా..కాజల్ బీహేవియర్ తో విసుకు చెందాడాని అప్పట్లో టాక్ వినిపించింది. అలాగే రామ్ చరణ్ తో కూడా చాలా సార్లు మిస్ బెహేవ్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి.
ఓ ఇంటర్వ్యులో చరణ్ సైతం ఇదే విషయాని..చెప్పేశాడు..కానీ, ఆ తరువాత జస్ట్ జోకింగ్ అంటూ కవర్ చేసుకొచ్చాడు. కాజల్ కి ఈ విషయంలో చిరంజీవి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత కాజల్ రామ్ చరణ్ తో పాటు చిరంజీవి తో కూడా సినిమాలు చేసింది.