Tiger Shroff : అసలు కథలు ఎలా పుట్టుకొస్తాయ్.? రీమేక్, ఒరిజినల్.. అనే మాటలు వింటుంటాం. బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు. కొరియన్ గట్రా ఇతర భాషా సినిమాలు కావచ్చు. నూటికి తొంభై తొమ్మిది సినిమాలూ ఎక్కడెక్కడి నుంచో లేపేసినవే. అలాంటప్పుడు రీమేక్, ఒరిజినల్.. అనే మాటల్లో అర్ధమే లేదు.
సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌ని తీసుకుంటే, తెలుగులో హిట్ అయిన సినిమాల్ని ఎక్కువగా రీమేక్ చేసేస్తుంటాడు. టైగర్ ష్రాఫ్ చేసిన ‘బాఘీ’ చిత్రం తెలుగులో ప్రబాస్ హిట్ మూవీ ‘వర్షం’ కి రీమేక్. అలాగే, ‘బాఘీ 2’, తెలుగులో ఆదాశర్మ, నటించిన ‘క్షణం’ మూవీకి రీమేక్. సునీల్, నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘తడాఖా’ సినిమాని మనోడు ‘బాఘీ 3’ కోసం రీమేక్ చేసేసుకున్నాడు.
అయితే, ఇక్కడ గమనించాల్సింది. టైగర్ ష్రాఫ్ కేవలం థీమ్ మాత్రమే తీసుకున్నాడీ సినిమాల్లో. తన మోటో మాత్రం ఫుల్ ఆఫ్ యాక్షన్. ఈ సినిమాలన్నింట్లోనూ కంప్లీట్ యాక్షన్‌తో నింపేశాడు. ఆయా సినిమాలు బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. సో, రీమేక్ అనే మాటలో అర్ధమే లేదంతే.
తెలుగులో ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో సహా, పలువురు హీరోలు రీమేకుల వైపే మొగ్గు చూపుతున్నారు. రీమేకుల గురించి క్లుప్తంగా చెప్పుకోవల్సి వస్తే, లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమా పూర్తవుతుంది. ఆల్రెడీ హిట్ అయిన కథ కాబట్టి, తక్కువ సమయంలోనే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, రీమేక్స్ చేయడమనేది అస్సలు తప్పే కాదని సినీ ప్రియులు, ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఎనీ డౌట్.!