అత్తను కిరాతకంగా చంపిన కోడలు.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ అసలు నిజం?

సాధారణంగా అత్తా కోడల మధ్య తరచూ మనస్పర్ధలు కారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో వారి మధ్య జరిగే ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ క్రమంలో ఒకరినొకరు కొట్టుకొని గాయాల పాలవుతుంటారు. అయితే మరి కొంతమంది అత్తా కోడలు మాత్రం ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకుని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఇటీవల అత్త మీద కక్ష పెట్టుకున్న కోడలు కిరాతకంగా అత్త ని హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా అత్త మీద కక్ష పెంచుకున్న కోడలు ఇటీవల ఆమెను హత్య చేసి తన కక్ష తీర్చుకుంది.

వివరాలలోకి వెళితే…పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబు వ్యక్తికి కొండాలమ్మ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరి వివాహం జరిగిన సమయంలో నుండి అత్త రజిని కుమారి, కోడలు కొండాలమ్మకి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అత్త పెట్టే ఇబ్బందులు భరించలేక కొండాలమ్మ అత్త మీద కక్ష పెంచుకుంది. దీంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో జూలై 27వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజనీకుమారి తలమీద కర్రతో విచక్షణ రహితంగా కొట్టింది. తర్వాత ఆమె గొంతు నులిమి చంపటానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే అప్పటికీ ఆమె మరణించకపోవడంతో చీరతో ఉరి బిగించడం వల్ల ఆమె సృహ కోల్పోయింది.

ఆ తర్వాత భర్త, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పింది. దీంతో రజనీకుమారి కూతురు కొడుకు ఇంటికి చేరుకొని గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రజనీకుమారి అక్కడ చికిత్స పొందుతూ జూలై 30వ తేదీన మరణించింది. అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రజనీకుమారి కొడుకుని విచారించగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి తన తల్లి మరణించిందని పోలీసులకు వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు రజనీకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా పోస్ట్ మార్టంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

రజనీకుమారి తలమీద బలంగా గాయం తగలడమే కాకుండా ఊపిరాడక చనిపోయిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కొండాలమ్మను తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. తన అత్త పెట్టే టార్చర్ భరించలేక హత్య చేశానని కొండాలమ్మ నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు కొండాలమ్మ మీద కేసు నమోదు చేసుకుని ఆమెని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.