బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో ఆ స్టార్ హీరో?

‘శంషేరా’ లాంటి భారీ డిసాస్టర్ తర్వాత రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ అనే సోసియో ఫాంటసీ సినిమాతో వచ్చాడు. గ్రాఫిక్స్ పరంగా సినిమా ఆకట్టున్నా కానీ కంటెంట్ పరంగా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తో నడుస్తుంది.

రణబీర్ తో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ‘ లో దేవ్ పాత్రలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

దీని ప్రకారం, రెండవ భాగం ఈ పాత్ర పై ఆధారపడి ఉంటుంది. బజ్ ఏదైనా ఉంటే, తదుపరి పార్ట్ క్రేజ్ మరింత స్థాయిని తాకడం ఖాయం. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రి పాత్ర దేవ్ ది. అయితే ఈ రోల్ కోసం ఎవర్ని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఆశించనంత లేకపోయినా…పర్వాలేదనిపిస్తున్నాయి.