Kaushal: ఆ సినిమా వల్ల నా జీవితమే నాశనం అయింది… సంచలన కామెంట్స్ చేసిన కౌశల్!

Kaushal: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 టైటిల్ విన్నర్‌గా నిలిచిన కౌశల్ మందా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. సీరియల్స్‌తో మంచి ఇమేజ్‌ను పొందిన కౌశల్, బిగ్‌బాస్‌ షో నుంచి వచ్చాక మాత్రం అవకాశాలు ఆమడంతో దూరంలోనే నిలిచిపోయాయని చెప్పవచ్చు. అయితే తాను ఒకప్పుడు తీసిన సినిమా వల్లే తన కెరీర్ అంతా నాశనమైందని తాజాగా కౌశల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ మారాయి.

ఇక వివరాల్లోకి వెళితే, తన తల్లికి క్యాన్సర్ వచ్చినపుడు ఫినాన్షియల్‌గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న ఆయన, ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికే అప్పట్లో రూ.50వేల రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పగానే ఒప్పుకున్నానని ఆయన అన్నారు. ఎయిడ్స్‌పై అవగాహన నేపథ్యంలో తీసిన ఆ సినిమాని పాత్ర తనపై నెగెటివ్ ఇంప్రెషన్‌ని తీసుకొచ్చిందని, కానీ ఆ సినిమా వల్లే తన కెరీర్ నాశనమైందని, ఆ సినిమాతోనే కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే పేరు వచ్చిందని ఆయన వాపోయారు. దాని నుంచి బయట పడడానికి తనకు చాలా సమయం పట్టిందని, ఆ తర్వాత తాను ఓ ప్రముఖ ఛానెల్ చేసిన చక్రవాకం సీరియల్‌తో ఆ బ్యాడ్ నేమ్ పోయిందని కౌశల్ వివరించారు. ఇంతకీ ఆ చెడ్డ పేరు తీసుకొచ్చిన మూవీ పేరు స్వర్ణ. అందులో కథానాయికగా రమ్మశ్రీ నటించగా, షకీలా, రేష్మ ఇతర పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉండగా సినిమాలు లేవని తానెప్పుడూ ఖాళీగా ఉండనని, తనకు ప్రొడక్షన్‌ హౌజ్ ఉందని, కాబట్టి ఎప్పుడూ తాను ఆ యాడ్స్, ఫ్యాషన్‌ షోస్‌తో బిజీగా ఉంటానని ఆయన చెప్పారు. తన తండ్రి అప్పట్లో నాటకాలు వేసేవారన్న కౌశల్, అవకాశాలు లేక తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అలా అన్ని దారులు మూసుకుపోయే స్థితి తనకి కూడా రాకూడదనే ఉద్దేశంతోనే తానెప్పుడూ మరో దారిని సిద్ధం చేసి పెట్టుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.