Akhanda Movie: అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన ఓ డైలాగ్ చాలా వైరల్ అయిందని ప్రముఖ రచయిత నాగ మహేశ్ అన్నారు. అది కొడాలి నానిని ఉద్దేశించి అన్నట్టుగా ఆ సమయంలో బాగా ట్రోల్ చేశారన్న ఆయన, ఇన్‌డైరెక్ట్ సెన్స్‌లో అతనిపై ఆ వ్యాఖ్యలు చేశారని చాలా మంది అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే కొడాలి నాని వాడే భాష కూడా అదే రీతిలో ఉండడం వల్ల జనాలు అలా అనుకున్నారని ఆయన వివరించారు.
మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్‌లో భాగమే అదని నాగ మహేశ్ అన్నారు. శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అని అడగడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లంబ్డీ కొడకా అనేది అఖండ సినిమాలో బాలయ్య గారి డైలాగ్ అని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇంకో కౌంటర్‌లో పట్టిసీమపై చెప్పే డైలాగ్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. దాని కంటే ముందు మేమేంటీ అంచనాల్లేక రంకేలేస్తా ఉన్నావ్. రంకెలేయడానికి నీవేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా అనే డైలాగ్ కూడా చాలా పాపులర్ అయిందని ఆయన తెలిపారు.
ఇకపోతే బాలకృష్ణ గారు తనతో చాలా సరదాగా ఉంటారన్న నాగ మహేశ్, మీరు మీరుగా ఉంటే పర్లేదు. కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ఆయన ఊరుకోరని మహేశ్ తెలిపారు. ఆయన్ని మెప్పించాలనో, బిస్కెట్లు వేయాలనో చూస్తే మాత్రం ఫసక్ అని ఆయన నవ్వుతూ చెప్పారు. పెద్ద స్టార్ అని గానీ, పెద్ద నటుడు అని గానీ బాలయ్య గారిలో ఏమీ కనిపించవని, అందరితోనూ చాలా సరదాగా మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు.