Prabhas: ప్రభాస్ కు ఉన్న ఈ పాడు అలవాటే అతనికి పెళ్లి కాకుండా చేస్తుందా… ఇప్పటికైనా మారుతారా?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.

ప్రభాస్ కంటే ఎంతో చిన్నవారు ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు కానీ ఈయన నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఆయనకు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటే కారణం అని తెలుస్తుంది. మరి ప్రభాస్ కి ఉన్న ఆ చెడ్డ అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే అది సిగ్గు అని చెప్పాలి.

సాధారణంగా ప్రభాస్ ఎక్కడ బయట కార్యక్రమాలలో కనిపించరు అలాగే ఇతరులతో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మాయిలంటే ఆమడ దూరం ఉంటారు. ప్రభాస్ అంటే ఎంతో మంది అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు కానీ ఈయన మాత్రం అమ్మాయిలను ఎప్పుడు కూడా గౌరవభావంతోనే చూస్తూ ఉంటారు. దీనికి తోడు ఎంతో బద్ధకస్తుడు అయినటువంటి ప్రభాస్ పెళ్లి చేసుకుంటే లేనిపోని బాధ్యతలను కూడా మోయాల్సి వస్తుందన్న కారణంతోనే పెళ్లి గురించి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.