థాంక్యూ అల్లు అర్జున్.. మీకు సినిమా నచ్చిందని తెలిసి సంతోషంగా ఉంది: మహేష్ బాబు

ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లు అర్జున్ ఇద్దరు ఒకరికొకరు ట్వీట్ చేసుకోవడమే కాకుండా ఒకరి సినిమాపై మరొకరు ప్రశంశల వర్షం కురిపించుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మేజర్ సినిమా పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు మనసుకు హత్తుకునేలా ఉంది ఇలాంటి అద్భుతమైన సినిమాని అందించినందుకు మహేష్ బాబుకు కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పై మహేష్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు రిప్లై ఇస్తూ..థాంక్యూ అల్లు అర్జున్ మీ మాటలు మేజర్ చిత్ర బృందానికి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మీకు సినిమా నచ్చిందని తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మహేష్ బాబు అల్లు అర్జున్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.మేజర్ సినిమా గురించి మహేష్ బాబు అల్లు అర్జున్ చేసుకున్న ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

మేజర్ సినిమాని సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ , శోభిత హీరో హీరోయిన్లుగా నటించగా శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి షో నుంచి అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతోంది.